ఆర్డీవోపై మంత్రి హరీష్‌రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం

ఆర్డీవోపై మంత్రి హరీష్‌రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం


సంగారెడ్డి: సంగారెడ్డి ఆర్డీవో శ్రీనుపై మంత్రి హరీష్‌రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీవోకి హరీష్‌రావు పదిసార్లు ఫోన్‌ చేసినా ఎత్తలేదని తెలుస్తోంది. దీంతో చివరికి ఆయన జేసీకి ఫోన్‌ చేసి ఆర్డీవోతో మాట్లాడించాలని చెప్పినా కూడా ఆర్డీవో స్పందించలేదని సమాచారం. తనకు ఎంతకీ ఆర్డీవో నుంచి ఫోన్‌ రాకపోవడంతో అసహనానికి గురైన హరీష్‌రావు.. కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఆర్డీవోపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.